మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టనున్న సానియా మీర్జా

  • వచ్చే ఏడాది జనవరిలో పునరాగమనం ఉంటుందన్న సానియా
  • 2017లో చివరిసారి ఆడిన టెన్నిస్ క్వీన్
  • రాబోయే రెండు నెలలు ఫిట్ నెస్ పై దృష్టి పెడతానని వెల్లడి
భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలో దిగనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆటలో కొనసాగుతానని సానియా తెలిపింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా గతేడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మరికొన్ని నెలల్లో తాను మళ్లీ రాకెట్ పట్టి అంతర్జాతీయ సర్క్యూట్ లో పునరాగమనం చేస్తానని సానియా పేర్కొంది. వచ్చే రెండు నెలల్లో ఫిట్ నెస్ సాధించడంపైనే తన భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రత్యేకంగా లక్ష్యాలేవీ పెట్టుకోలేదని, ఎలాంటి విజయమైనా బోనస్ గానే భావిస్తానని తెలిపింది. సానియా చివరిసారి 2017లో చైనా ఓపెన్ టోర్నీ ఆడింది. అప్పటినుంచి ఆమె ఆటకు దూరంగా ఉంది.
Go Back to Shorts
Sania Mirza
Tennis
India

More Telugu News